- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో గ్రామాల అభివృద్ధి భేష్: మధ్యప్రదేశ్ సర్పంచుల బృందం
దిశ, ములుగు: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి భేష్ గా ఉందని మధ్యప్రదేశ్ కు చెందిన సర్పంచులు కితాబిచ్చారు. మంగళవారం మర్కుక్ మండలంలోని నరసన్నపేట గ్రామంలో మధ్యప్రదేశ్ కు చెందిన సర్పంచుల బృందం పర్యటించింది. నరసన్నపేట గ్రామాన్ని అన్ని హంగులతో తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దిందని అందులో భాగంగా మిషన్ భగీరథ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, శానిటేషన్, గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ వినియోగం, తడి చెత్త, పొడి చెత్త వంటి వివరాలను సర్పంచ్ మాధవి రాజిరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా నీటిని ఉదయం, సాయంత్రం సమయాల్లో గ్రామాల్లోకి వదిలే విధానాన్ని ఏఈ తిరుమలరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో చెత్త సేకరణ విధానాన్ని గ్రామంలో తిరిగి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ లో చెత్త సేకరణన చేసిన తరువాత ఎరువులుగా తయారు చేయడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషిన్ భగీరథ ఈఈ గిరిధర్, డిఈ సుమలత, నరసన్నపేట ఉప సర్పంచ్ కృష్ణవేణి, వార్డ్ మెంబర్స్ కనకరాజు, యాకమ్మ, రూప, బాలమణి, నర్సింహులు, రాంరెడ్డి, ఎల్లారెడ్డి, మహేందర్, నారాయణరెడ్డి, యాదవ రెడ్డి, మైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.