- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy : రేవంత్ రెడ్డికి అనుకూలంగా విజయశాంతి కామెంట్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేత విజయశాంతి కామెంట్ సంచలనంగా మారాయి. టీకాంగ్రెస్ కుమ్ములాటపై ఆమె రియాక్ట్ కావడం ఆసక్తిగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఆమె మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయశాంతి.. కాంగ్రెస్ కోసం పని చేసే వారిపై కుట్రలు చేస్తున్నారని, పని చేస్తన్న వారిని కిందకి లాగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ మారకుండా మాణిక్కం ఠాగూర్ పోయి మాణిక్ ఠాక్రే వచ్చినా ఎవరేం చేయలేరన్నారు. పార్టీతో పాటు తాము ఎదిగేందుకు శ్రమించే నేతల్ని కిందికి లాగిపడేయ్యడానికి నిరంతరం కుట్రలు జరుగుతూనే ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడైన సోదరుడు రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు, టీపీసీసీలో జరగుతున్న పరిణామాలు ఇవేనన్నారు. బీఆర్ఎస్ అవినీతి, కేసీఆర్ నియంతృత్వంపై పోరాటంలో బీజేపీకి ఉన్నంత బలం కాంగ్రెస్ కు లేకపోయినప్పటికీ ఆయా పార్టీల సొంత మనుగడ కోసమైనా నేతలు పని చేయాలని సూచించారు.
రాములమ్మ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి?:
గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన విజయశాంతి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె రాష్ట్ర బీజేపీ నేతలపై ఆసంతృప్తిని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఆమె మద్దతుగా నిలవడం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో బీజేపీ బలం ఏంటో చెబుతునే కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలపై ఆమె రియాక్ట్ కావడం వెనుక రీజన్ ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కాంగ్రెస్ లో పని చేసిన అనుభవం కారణంగా అక్కడ జరిగే అంతర్గత వ్యవహారాలపై స్పందించారా లేక మరేదైనా కారణం ఉందా అనేది సస్పెన్స్ గా మారింది.