Hindus in Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై రాములమ్మ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
Hindus in Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై రాములమ్మ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి హసీనా తప్పుకున్న అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దారుణాతి దారుణమైనవని నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హిందువులు, హిందువుల ఆస్తులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరాల వీడియోలు చూసి ఎవరైనా తల్లడిల్లే పరిస్థితులు అవన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు.

అదే సమయంలో అక్కడ కేవలం హిందువులనే గాక మాజీ ప్రధాని హసీనా పార్టీ అవామీ లీగ్‌కు చెందిన చెందిన అనేకమంది హత్యకు గురయ్యారని తెలిపారు. వారి ఇళ్లు, వ్యాపార సంస్థలు కూడా విధ్వంసానికి గురయ్యాయని, నటుడు, నిర్మాత అయిన ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. వీరూ ముస్లింలే.. ఎవరెవరిపైనో ఎవరెవరికో ఉన్న పాత కక్షలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు, ఇంకెందరో తమ ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు.

రిజర్వేషన్ల అంశంపై ఆ దేశంలో పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని హిందూ విద్వేష ఉగ్రవాద శక్తులు కూడా అందులోకి చొరబడ్డాయని ఆరోపించారు. ఆ నిరసనల మాటున హిందూ విద్వేషాన్ని ఈ మారణకాండ రూపంలో వెల్లడించాయన్నారు. ఉగ్రవాదాన్ని ద్వేషిద్దాం.. పై సంఘటనలను తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed