- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ విచారణకు Vijay Devarakonda
దిశ, డైనమిక్ బ్యూరో : సినీ హీరో విజయ్ దేవరకొండ నేడు ఈడీ విచారణకు హాజరయ్యాడు. లైగర్ మూవీకి సంబంధించిన లావాదేవీలపై విజయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్ని్స్తు్న్నారు. మూవీకి ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఎవరెవరు పెట్టుబడులు పెట్టారనే అంశాలపై ఈడీ విజయ్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. గతంలో ఈడీ విచారణకు లైగర్ మూవీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీలను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. లైగర్ మూవీకి సంబంధించిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. దాదాపు 12 గంటలపాటు పూరీ, చార్మీని ఈడీ ప్రశ్నించింది. లైగర్ పెట్టుబడుల వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు ఆరా తీశారు. లైగర్ సినిమా నిర్మాణానికి పలు సంస్థల నుంచి డబ్బులు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలువురు రాజకీయనేతల ఖాతాల నుంచి డబ్బులు మూవీ కోసం ట్రాన్సక్షన్స్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలో లైగర్ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ చార్మీలు ఇచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని, హీరో విజయ్‌ను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తుంది.