- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటన వేళ వీహెచ్ మరోసారి హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. అతి త్వరలోనే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు అధిష్టానం కసరత్తు వేగవంతం చేసిన తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని.. కాంగ్రెస్ గెలవాలంటే బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. మంగళవారం న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన వీహెచ్.. అంబర్ పేట టికెట్ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తాను పోటీ నుంచి తప్పుకున్నానని అపవాదు వేస్తున్నారని, ఇది తనను బాధిస్తోందన్నారు.
ఇప్పటి వరకు తానెప్పుడు ఎవరికి వ్యతిరేకంగా లేనని, బడుగు బలహీన వర్గాల వారి పక్షానే నేను నిలుస్తానన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. నేను రెడ్లకు వ్యతిరేకం కాదన్నారు. అదే సమయంలో సామాజిక న్యాయం జరగాలన్నదే తన తాపత్రయం అని చెప్పారు. తాను గట్టిగా మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందనే మౌనంగా ఉంటున్నానని, కార్యకర్తలందరికీ న్యాయం జరగాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కుట్ర కోణం ఉందని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, ఇది సరైన పద్దతి కాదన్నారు. ఇకైనా తప్పును సరిదిద్దుకోవాలన్నారు.