- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ గాంధీకి సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలి: VH డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: అస్సాం సీఎం హిమాంత బిస్వా శర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రావణుడితో పోల్చడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. సీఎం బిస్వా శర్మ రాహుల్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం హిమాంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ రాహుల్ గాంధీపై సీఎం బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మోడీ రాముడు.. రాహుల్ గాంధీ రావణుడు అన్న వ్యాఖ్యలపై సీఎం క్షమాపణ చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశాడు.
పార్లమెంట్ ఎన్నికల కోసమే బీజేపీ రాముడి పేరును వాడుకుంటుందని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరంలో జరిగిన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకకు భద్రాది ఆలయానికి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు. రాముడి అందరివాడని.. కొందరి వాడు కాదని స్పష్టం చేశారు. ఓట్ల కోసమే బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాగా, అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీపై ఆ స్టేట్ సీఎం హిమాంత బిస్వా శర్మ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మీడియా ముందే రావణుడని అన్నారు.