- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral News: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ముందే చెప్పిన వేణు స్వామి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం తనయ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు 4 గంటల పాటు ఆమెను విచారించారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు. ఆమె సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కవితను ఫ్లైట్లో ఢిల్లీ తరలిస్తున్నారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. కవిత అరెస్ట్‌పై ఆ వీడియోలో వేణు స్వామి ముందే చెప్పారు. కవిత గ్రహబలా బలాలను బట్టి ఆమెకు కారాగార వాసం తప్పదని తెలిపారు. అయితే ఏ కేసు అనేది చెప్పలేకపోయారు. కానీ కవిత కచ్చితంగా అరెస్ట్ అవుతారని వేణు స్వామి చెప్పారు. ఎమ్మెల్సీ కవితనే కాదని, తెలంగాణలో మరో 7, 8 మంది నేతలు సైతం అరెస్ట్ అవుతారని తెలిపారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడంతో వేణుస్వామి చెప్పినట్టే జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
2024 లో కవిత అరెస్ట్
— AP360 (@andhraa360) March 15, 2024
2023 లో కెసిఆర్ ఓటమి
2024 లో బాబు గెలవడు
ఒకే ఒక్కడు - వేణు స్వామి#CBN #Kavitha #AndhraPradesh https://t.co/ocL61Zq58n pic.twitter.com/LvOHPA3E30