Vemulawada: ప్రభుత్వ భూమిలోనే బీఆర్ఎస్ భవనం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Ramesh Goud |
Vemulawada: ప్రభుత్వ భూమిలోనే బీఆర్ఎస్ భవనం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ భవనం(BRS Bhavan) ప్రభుత్వ భూమిలో ఉన్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Woking President KTR) సిరిసిల్ల(Siricilla) బీఆర్ఎస్ భవన్ లో కూర్చోని అబద్దాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. సిరిసిల్లలో కబ్జాలు లేవు అంటున్నారని, కానీ ఆయన మాట్లాడిన బీఆర్ఎస్ భవనం ప్రభుత్వ భూమిలోనే కట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ హయాంలో నేను పట్టణాలను కబ్జా చేసి, మీకు పల్లెలను దోచి పెడతా అన్న విధంగా కేటీఆర్ కబ్జాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ భూమి 250 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నామని, కబ్జా చేసిన వాళ్లే తిరిగి ఇస్తున్న తరుణంలో కేటీఆర్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కరీంనగర్ సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్టి(MLA Kowshik Reddy) ‌ప్రవర్తనను ఖండించారు. అధికారిక సమావేశంలో ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడటం పోయి.. అలా ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు. ఇది బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని, బీఆర్ఎస్ నాయకులకు పార్టీ నేర్పిన సంస్కారం ఇదేనా? అని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story