Prashanth Reddy: ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. బూతుల రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |
Prashanth Reddy: ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. బూతుల రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: షాద్‌నగర్ మీటింగులో ఫ్రస్టేషన్‌తో ఊగిపోతూ ఎప్పటిలాగే రేవంత్‌రెడ్డి ఆ కంపునోరుతో అవే అబద్ధాలు.. అవే సంస్కారం లేని మాటలు.. అవే బూతులు మాట్లాడారని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అందుకే ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి కాకుండా బూతుల రేవంత్‌రెడ్డి అని అంటున్నారని పేర్కొన్నారు. హామీలు నెరవేర్చకపోవడంతో కోతలు రేవంత్‌రెడ్డి అని కూడా పిలుస్తున్నారని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్విట్టర్‌కు, టిక్‌టాక్‌కు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని.. అచ్చోసిన ఆంబోతులా ఊరేగుతున్నాడని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో సర్వే పోల్ పెట్టి ప్రజలతో తన్నించుకున్నారని అన్నారు. మాట తప్పను అని చెప్పి.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. నేటికీ ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారు. జనవరి 26న టిక్.. టిక్ అన్నదెవరు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా టిక్ టిక్‌మని వినిపించిందా అని నిలదీశారు. ‘కేసీఆర్ కొడితే దెబ్బ ఎట్లుంటదో నీకు తెలవదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్ గడ్డమీదకి వచ్చి నిన్ను మట్టిగరిపించినం. అక్కడ కొట్టిన దెబ్బకు వచ్చి మల్కాజిగిరిలో పడ్డవు. యావత్ తెలంగాణ ప్రజలు నిన్ను ఓటు తోని మళ్లీ కొడుతరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని గంగలో పడేస్తరు’ అని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ వ్యాధి వచ్చిందని.. వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

Next Story

Most Viewed