- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vem Narender Reddy: నా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు జాగ్రత్త!.. సీఎం ముఖ్య సలహాదారు ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: తన పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, దయచేసి అలాంటి వారిని నమ్మొద్దని సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా.. ఇటీవల కొందరు వ్యక్తులు నా పేరు ఉపయోగించి డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన విషయం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈరోజు రాచకొండ సీపీ, వారి పోలీస్ బృందం ఆ గ్యాంగ్ ను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. కావున ఇక నుంచి ఎవరైనా నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని కోరుకుంటన్నానని, మళ్ళీ అలాంటి కాల్స్ వస్తే మా ఆఫీస్ సిబ్బందిని సంప్రదించాలని, వేం నరేందర్ రెడ్డి ఎక్స్ ద్వారా సూచించారు.