- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త సెక్రటేరియట్‌కు వీధిపోటు.. అందుకే రూట్ చేంజ్!
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ ఖర్చుతో, అంగరంగా వైభవంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్‌కు వీధిపోటు సమస్య వచ్చిపడిందనే ప్రచారం జరుగుతోంది. ఆ సమస్యను తప్పించుకునేందుకు కొత్త రోడ్లు నిర్మిస్తున్నారని టాక్ ఉంది. రెండు మూడు రోజులుగా సెక్రటేరియట్ ప్రాంతంలో పాత రోడ్లను మార్చి, కొత్త రోడ్లు నిర్మిస్తున్నారు. ఇందుకోసం సోమవారం సెక్రటేరియట్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు చేశారు. ఈనెల 30న కొత్త సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈలోపే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసే పనిలో ఆర్‌అండ్‌బీ అధికారులు నిమగ్నమయ్యారు.
బీఆర్కే ముందు నుంచి వచ్చే రోడ్డు మళ్లింపు
ప్రస్తుతం బీఆర్కే బిల్డింగ్ నుంచి ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ బ్రిడ్జిపైకి రావాలంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న సిగ్నల్‌ను దాటాలి. కానీ ఆ రోడ్డుతో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌కు వీధిపోటుగా ఉందని వాస్తు నిపుణులు సూచించినట్టు తెలుస్తున్నది. దీంతో ఆ సిగ్నల్‌ను పూర్తిగా మూసివేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఎల్‌ఐసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న డివైడర్‌ను తొలగించి, కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ రోడ్డుకు ఎటాచ్ చేశారు. దీంతో వీధిపోటు నుంచి తప్పించినట్టు అవుతుందని భావిస్తున్నారు.
బీఆర్కే బిల్డింగ్ వద్ద రోడ్డు కుదింపు
వీధిపోటు సమస్య నుంచి తప్పించేందుకు ప్రస్తుతం బీఆర్కే భవనం ప్రహరీని కూల్చివేశారు. అక్కడ ప్రస్తుతం కొత్తగా స్టీల్ గ్రిడ్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్కే భవనంలోకి రాకపోకల కోసం రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీధిపోటు సమస్యను అధిగమించాలంటే అక్కడ రోడ్డును కుదించడంతో పాటు రోడ్డును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైపునకు కాస్త ములుపు తిప్పి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ మార్గంలో మార్పులు చేర్పులు
ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గం నుంచి లుంబిని పార్క్ వరకు హుస్సేన్‌సాగర్‌కు ఆనుకొని ఉన్న రోడ్డలో మార్పులు చేస్తున్నారు. కొత్త సెక్రటేరియట్ ముందు కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డు మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కిందకు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రైట్ టర్న్ తీసుకునే చాన్స్ ఉండదు. రవీంద్ర భారతి వైపునకు వెళ్లే వాహనదారులు అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చే యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆ విగ్రహాల పరిస్థితి ఏంటీ?
కొత్త సెక్రటేరియట్ పరిసరాల్లో తెలుగుతల్లి విగ్రహం, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎదురుగా నర్మించిన అమరవీరుల స్మారకం మధ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొత్తగా గార్డెనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆ విగ్రహాలను అక్కడ ఉంచుతారా? వాటిని ఇతర చోటుకు మారుస్తారా అనే చర్చ జరుగుతోంది.
Read more: