- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ కు వాస్తు ఎఫెక్ట్.. ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు
దిశ, డైనమిక్ బ్యూరో:
బీఆర్ఎస్ ఆఫీస్ తెలంగాణ భవన్ లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోగా ఎంపీ ఎన్నికల్లోనైనా మెరుగైన స్థానాలు దక్కించుకుని పార్టీకి పునర్ వైభవం తీసుకువద్దామని భావించగా పార్టీ నుంచి నేతలు వలసలు గులాబీ పార్టీని మరింత కుంగదీస్తోంది. మరో వైపు ఒపీనియన్ పోల్స్ లో బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితం అవుతాయని సర్వే సంస్థలు అంచనా వేస్తుండటంతో ఇక సీట్ల సంఖ్యను పెంచేందుకు గులాబీ బాస్ కేసీఆర్ వాస్తు మార్పును నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బంజారాహిల్స్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో రాకపోకల ద్వారాన్ని మార్చే పనులను పార్టీ నేతలు చకచక చేస్తున్నారు. .
రాకపోకలకు కొత్త మార్గం:
ప్రస్తుతం ఆఫీస్ కు ఉన్న వాస్తు దోషం కారణంగానే పరిస్థితులు పార్టీ కలిసి రావడం లేదని పండితుల సూచనలు చేసినట్లు చర్చ జరుగుతోంది. వారి సలహాలు సూచనల మేరకు కార్యాలయానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా.. ఇప్పటి వరకు వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నారు. అలా రాకపోకలు సాగించడం మంచిది కాదని పండితులు సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇకపై ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించారని. ఈ మేరకు ఇటువైపు వాహనాలు వచ్చి వెళ్లేలా కొత్తగా ర్యాంపును సిద్ధం చేస్తున్నారు. అలాగే వీధి పోటును దృష్టిలో ఉంచుకుని లక్ష్మినరసింహ స్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని సైతం గేటుకు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాంగణంలో కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించడం వెనుక ట్రాఫిక్ సమస్య కూడా ఒక కారణం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా వాహనాలు నిలిపే పరిస్తితి లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వైపు వెళ్లే రహదారి వెంట వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ భవన్ లోకి వెళ్లేందుకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాస్తు నిపుణుల సూచనల మేరకు తాజా మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా మార్పులు గులాబీ పార్టీ అధినేతకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.