- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vande Bharat: తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు.. ఆ మార్గంలో పరుగులు పెట్టనున్న కొత్త ‘వందేభారత్’
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఇప్పటికే చాలా రైళ్లు నడుస్తుండగా.. వాటికి అదనంగా మరో హై స్పీడ్ ట్రైన్ వందే భారత్‌ను నడపనున్నారు. అధిక రద్దీకి స్వస్తి చెప్పేందుకే రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 13న వందే భారత్ ట్రైన్‌ను రేపు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
ఇక తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 15న శుక్రవారం నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయి. అందుకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టు్నున్నారు. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుండి ఉదయం 05.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అటువైపు నుంచి రైలు నంబర్ 20708 విశాఖ నుంచి వందేభారత్ రైలు 14.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అయితే ఈ ట్రైన్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనుంది.