- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కక్కుర్తిపడే ప్రాజెక్టులు కట్టిండ్రు: మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కమీషన్ల కోసం కక్కుర్తిపడే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నీటి పారుదల శాఖపై జలసౌధలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేటీఆర్ మళ్లీ అనాలోచితంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రాజెక్టులు ధ్వంసం చేశారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ అనాలోచిత పనులతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే లోపాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని లూఠీ చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాధాన్యత గల ప్రాజెక్టులను వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని స్పష్టం మంత్రి ఉత్తమ్ చేశారు.