మిగిలిపోయిన భాషా పండితులకు అప్ గ్రేడేషన్, పదోన్నతులు కల్పించాలి: సి. జగదీశ్

by Mahesh |
మిగిలిపోయిన భాషా పండితులకు అప్ గ్రేడేషన్, పదోన్నతులు కల్పించాలి: సి. జగదీశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మిగిలిపోయిన భాషా పండితులకు అప్ గ్రేడేషన్, పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సి. జగదీష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. నర్సీంలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో శనివారం పండిత పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జీహెచ్ ఎం పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయులకు అడ్డంకిగా ఉన్న 10-2-3 విధానాన్ని రద్దు చేసి, అందరితో సమానంగా వారికీ జీహెచ్ ఎం పదోన్నతుల్లో అవకాశం కల్పించాలన్నారు. 1/2005 యాక్టు ద్వారా నష్టపోయిన భాషాపండితులకు ప్రభుత్వం పెద్ద మనసుతో నోషనల్ సర్వీసును అనుమతిస్తూ తగిన ఉత్తర్వులు వెలువరించాలని తీర్మానం చేశారు. రాష్టంలోని 33 జిల్లాల లో గల భాషా పండితులందరూ గుర్తింపు గల భాషా పండిత సంఘంలో ఆర్ యుపిపిటిఎస్ (జగదీశ్ ) సంఘంలో సభ్యత్వం తీసుకుని భాషాపండితుల సమస్యల పరిష్కారానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. కొంతమంది పండితుల సమస్యలు పరిష్కారమైనాయి ఇక సంఘమెందుకు అని అవాకులు చెవాకులు పేలుతున్నారని , అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed