CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి యూపీ డిప్యూటీ సీఎం కుంభమేళా ఆహ్వానం

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి యూపీ డిప్యూటీ సీఎం కుంభమేళా ఆహ్వానం
X

దిశ, వెడ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP) ఉపముఖ్యమంత్రి( Deputy CM) కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ప్రయాగరాజ్ కుంభమేళా(Kumbh Mela) ఆహ్వానాన్ని అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగరాజ్ కుంభమేళా ఆహ్వానాన్ని అందించారు. మహా కుంభమేళా 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని భక్తులు విశ్వసిస్తారు.

భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంలో మహా కుంభ మేళా కీలక ఘట్టంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి 12వ సంవత్సరాలకు మాఘ మాసంలోని అమావాస్య రోజున బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా జరుపుకుంటారు. ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని, కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనస్సు, ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. యమునా, గంగా సంగమం దగ్గర ఉన్న దశాశ్వమేధ ఘాట్ దగ్గర అశ్వమేధ యాగం చేయడం ద్వారా ప్రజాపతి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని పురాణాలలో చెప్పబడింది. దీని కారణంగా ప్రయాగ్‌రాజ్ లోని కుంభమేళా అన్ని కుంభోత్సవాలలో అత్యంత ముఖ్యమైనదిగా ప్రాచుర్యం పొందింది.

Advertisement

Next Story

Most Viewed