ప్రభుత్వం, వ్యాపారులే కాదు.. పట్టాలు కూడా రైతులకు హ్యాడించాయ్! (వీడియో)

by Mahesh |
ప్రభుత్వం, వ్యాపారులే కాదు.. పట్టాలు కూడా రైతులకు హ్యాడించాయ్! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకాల వర్షాలు తెలంగాణ రైతులను ఆగం ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొన్ని గంటల్లో అమ్ముడు పోతుందనే సమయంలో భారీ వర్షం వచ్చి రైతులకు కన్నీరు మిగిల్చింది. ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా జిల్లాలో పంట నీటి పాలైంది. అలాగే ఇదురు గాలుల వల్ల మామిడి, జామ, మక్క, మిరప వంటి పంటలు నేల రాలాయి. అయితే ప్రస్తుతం ఓ ప్రాంతంలోని రైతులు కుప్పలుగా పోసిన ధాన్యం వద్ద ఈదురుగాలులు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రైతులు పడే వేదన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణగా ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కాగా ఆ వీడియోలో రైతులు వరి కుప్పల‌పై వర్షం నుంచి తమ ధాన్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన పట్టాలు భారీ ఈదురు గాలులకు పైకి ఎగిసిపడటం కనిపించింది. అలాగే ఆ పట్టాలు ఆకాశంలోకి అమాంతం ఎగిరిపోవడం కూడా ఈ వీడియో లో స్పష్టంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈదురు గాలుల కారణంగా ఆగం అవుతున్న రైతులు చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు.

భారీ ఈదురు గాలులకు గాల్లోకి ఎగిసిపడిని పట్టాలు (వీడియో)

Advertisement

Next Story

Most Viewed