- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవసరమైతే మేము రికమెండ్ చేస్తాం.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సూచన
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ చేసిన తప్పుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. ఇది చాలా పెద్ద స్కామ్ అని, దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో కేంద్రం సీబీఐతో విచారణ జరిగేలా రికమండ్ చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయవద్దనే చట్టాన్ని బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఆ చట్టాన్ని తీసివేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అసలు కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుందో చెప్పాలని కోరారు.