- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గజ్వేల్‌లో ఈటల పోటీ చేయడంతో కేసీఆర్‌కు నిద్రపట్టట్లే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వదిలిన బాణం ఈటల రాజేందర్ అని కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఈటల రాజేందర్ అభిమానులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేయడంతో సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో గెలుస్తాననే నమ్మకం కేసీఆర్‌కు లేదన్నారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంది అయ్యిందని, ప్రజలను కేసీఆర్ బానిసలుగా మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే వెళ్తున్నాయన్నారు. డబ్బుతో గజ్వేల్ ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. 30 వేల మంది రైతుల భూములను కేసీఆర్ లాక్కున్నారని నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటేసినట్లేనని.. అదే బీజేపీకి ఓటేస్తే భవిష్యత్ తరాల అభివృద్ధికి ఓటు వేసినట్లు అని అన్నారు.