ఇక తిరుపతికి 8:30 గంటలే.. మోడీకి థాంక్యూ చెప్పిన కేంద్ర మంత్రి

by Javid Pasha |
ఇక తిరుపతికి 8:30 గంటలే.. మోడీకి థాంక్యూ చెప్పిన కేంద్ర మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారని, ఈ రైలు సికింద్రాబాద్-తిరుపతి మధ్య రాకపోకలు కొనసాగించనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణానికి 12 గంటల సమయం పట్టేదని, ఈ రైలు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్-తిరుపతికి మధ్య దూరం కేవలం 8:30 గంటలు మాత్రమే ఉండనుందని కిషన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఈనెల 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఈ రైలును మోడీ ఘనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుందని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. కాగా ప్రారంభోత్సవం రోజున నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగనున్నట్లు తెలిపారు.

వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రారంభోత్సవం సందర్భంగా వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. 400 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని ప్రకటించిన భారతీయ రైల్వే, అధునాతనమైన కోచ్ లతో, వేగవంతమైన సేవలను, ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు అందించాలన్న లక్ష్యంతో ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed