ఉద్యోగ కల్పనకు కేంద్రం కృషి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Javid Pasha |
Kishan Reddy lashes out at TRS Flexi Politics
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగ కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్​లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ లో మంగళవారం నిర్వహించిన రోజ్​గార్​మేళాకు ఆయన హాజరయ్యారు. 9 జాతీయ బ్యాంకులు, డీఆర్​డీవో, ఇండియన్ రైల్వే, డిఫెన్స్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహా మొత్తం 22 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 470 మందికి కేంద్ర మంత్రి అపాయింట్​మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కొనియాడారు.

ప్రధాని మోడీ క్యాబినెట్​మీటింగ్ పెట్టి అన్ని శాఖల ఖాళీలను గుర్తించాలని కోరారని, ఖాళీల లెక్కలన్నీ తీయగా.. దాదాపు 10 లక్షల పోస్టులు ఉన్నట్టుగా గుర్తించారన్నారు. 10 లక్షల ఖాళీలను ఏకకాలంలో రిక్రూట్​చేయడం సాధ్యం కాదని, నెలకు 70 వేల చొప్పున భర్తీ చేస్తున్నారన్నారు. 22 అక్టోబర్ 2022న దీపావళి కానుకగా మోడీ ‘రోజ్ గార్ మేళా’ను ప్రారంభించారని తెలిపారు. కాగా ఇది 6వ రోజ్‌గార్ మేళా అని, ఇప్పటి వరకు 4.30 లక్షల మంది యువతకు నియామక పత్రాలు అందజేసినట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed