- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వంద రోజుల్లో తెరిపిస్తామన్న కేసీఆర్ నోరు విప్పాలి’
దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారం స్టీల్ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మూతపడిన అనేక పరిశ్రమలను వంద రోజుల్లో తెరిపిస్తామన్న కేసీఆర్ నోరు విప్పాలని అన్నారు. స్టీల్ ఫ్లాంట్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం పోజులు కొడుతోందని చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు ప్రశ్నించాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణను గాలికొదిలేసి బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని ఉద్దరిస్తాననటం హాస్పాస్పదంగా ఉందని చెప్పారు.
కేంద్రాన్ని విమర్శించటమే ఎజెండాగా సీఎం కేసీఆర్ కుటుంబం పెట్టుకుందని అన్నారు. వంద రోజుల్లో నిజాం ఘగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అన్నారని, తొమ్మిదేళ్లు అవుతున్నా ఎందుకు ఓపెన్ చేయలేదని నిలదీశారు. మూతపడిన పరిశ్రమలను వంద రోజుల్లో తెరిపిస్తామని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. సుమారు 9 సంవత్సరాల తరువాత అంబేద్కర్ జయంతి రోజున కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రతి ముఖ్యమంత్రి ట్యాంకు బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వచ్చి నివాళి అర్పించే సంప్రదాయం ఉండేదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కసారి కూడా రాలేదని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రద్దు చేయాలన్నారని, కేసీఆర్ రాజ్యాంగం, కల్వకుంట్ల రాజ్యాంగం రావాలని ఆయన కొట్టుకుంటున్నారని చెప్పారు.