- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ!
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకుల జరిగాయి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టేజీమీద మంత్రి ఉన్న సమయంలో ఓ వ్యక్తి స్టేజీపైకి వచ్చి మంత్రిని నిలదీశాడు. మంత్రి ఎంత సర్దిచెప్పినా సదరు వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్లారు.
గోల్కొండ కోట ప్రాంతంలో భూమి కబ్జాకు గురైందని.. ఈ విషయాన్ని వాట్సాప్ ద్వారా కిషన్ రెడ్డికి విషయాన్ని చేరవేసినా ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. తన పేరు ఇలియాజ్ ఖాన్ అని తాను ఫార్మర్ అసోసియేషన్ జరనల్ సెక్రటరీగా పని చేశానని సదరు వ్యక్తి చెప్పాడు. తాను తన ఒక్కడి కోసమే పోరాటం చేయడం లేదని.. రైతులందరి కోసం పోరాటం చేస్తున్నానని బాధితుల్లో ముస్లింలతో పాటు ఎస్సీ, ఎస్టీ వాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. అందరికీ న్యాయం చేయాలని కోరారు.
Also Read..