- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్.. వన్ ఎలక్షన్
దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి, బంధుప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి కిషన్ రెడ్డి తెలుగు మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో 95 శాతం ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. కర్ఫ్యూ లేని భారతాన్ని నిర్మాణం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని తెలిపారు. మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని మోడీ గ్యారంటీ ఇచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ ను సర్వీస్ సెక్టార్ హబ్‌గా విస్తరిస్తామన్నారు. భారతదేశాన్ని మిల్లెట్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.