- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు బీఆర్ఎస్‌లోకి.. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఓటేయొద్దని అన్నారు. గ్యారెంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారని దుయ్యబట్టారు. జూన్ నెలలో ఎన్నికోల కోడ్ అయిపోగానే రూ.2 లక్షల రుణమాఫీ చేయకుండా ఆగస్ట్ 15 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఓటేయొద్దని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి పంపారు.. ఇప్పుడు బీఆర్ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 5 నెలలు గడిచిన కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించలేదన్నారు. బీఆర్ఎస్ చాలా బలహీన పడిందని.. ఆ పార్టీ దాదాపు కనుమరుగైపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం చూసి కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని సెటైర్ వేశారు. కవిత లిక్కర్ స్కామ్ కేసు, ఫోన్ల ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ కురుకుపోయిందని విమర్శించారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.