- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత తెలంగాణ పరువు తీశారు: కేంద్ర మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కీలక పాత్ర పోషించి కవిత తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షఉడు కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఆప్ ప్రభుత్వంతో చర్చలు జరుపలేదా? అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవిత పాత్ర లేకపోతే కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తానేం చేశానో నా ప్రజలకు తెలుసు అని అన్నారు.
అడ్డగోలు మాటలుకాదు.. దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలని సీరియస్ అయ్యారు. అనంతరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఇండైరెక్టుగా కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.