సికింద్రాబాద్‌లో పోలీసుల లాఠీచార్జ్.. గాయపడ్డ వారిని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

by Mahesh |   ( Updated:2024-10-19 16:36:57.0  )
సికింద్రాబాద్‌లో పోలీసుల లాఠీచార్జ్.. గాయపడ్డ వారిని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో దూరి.. అమ్మవారి విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ రోజు సికింద్రబాద్ బంద్ తో పాటు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వేలాదిగా తరలివచ్చిన నిరసన కారులను అదుపు చేసేందుకు ముత్యాలమ్మ ఆలయం వద్ద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి తీవ్రంగా గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. లాఠీ చార్జీని ఖండించారు. అనంతరం సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇవాళ జరిగిన లాఠీఛార్జ్‌లో గాయపడ్డ వెంకట్, సాయిలను పరామర్శించడం బండి సంజయ్ పరామర్శించారు. అలాగే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్థానిక పార్టీ నేతలకు సూచించారు. ఈ క్రమంలో బండి వారితో మాట్లాడుతూ.. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story