- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిడ్డా.. నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం తీస్తా! బండి సంజయ్ మాస్ వార్నింగ్

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్ (KCR) కొడుక్కి పని పాట ఏమీ లేదని (Union Minister Bandi sanjay) కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ గతిలేరని అన్నారు. (MLC Elections) ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. దానిపై దృష్టి పెట్టకుండా.. నాపై ఏడుస్తారు.. అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ను సీఎం ఎందుకు అరెస్ట్ చేయిస్తలేరని (KTR) కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, ఈ-ఫార్ములా వన్, బావమరిది ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసుల్లో చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కేసుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని కేటీఆర్‌ను నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యారని, కే, ఆర్ (కేటీఆర్, రేవంత్) బ్రదర్స్ వీళ్లేనని కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ దొంగ నాటకాలు బంద్ చేయాలని, ఇంకా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. బిడ్డా.. నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం బయటపెడతా.. అంటూ కేటీఆర్‌కు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.