- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడాన్ని ఎవరూ ఆపలేరు: కేంద్ర మంత్రి చౌబే సెన్సేషనల్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుందని.. ఇవాళో రేపో ఆమెకు శిక్ష పడటం ఖాయమన్నారు. లిక్కర్ స్కామ్ నుంచి కవితను ఎవరూ కాపాడలేరని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే అన్నారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో అవార్డులు ఇస్తూ గల్లీలో అబద్దాలు చెబుతున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్‌కు అవార్డులు ఇవ్వలేదని వారికి జైళ్ళు ఇస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ లిక్కర్ స్కామ్, కరప్షన్ మీద పడిందని ఆప్‌తో కుమ్మక్కై లిక్కర్ స్కామ్ చేసిందన్నారు.
ప్రతి స్కీమ్‌లోనూ బీఆర్ఎస్ నేతలు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామన్నారు. సర్వే చేసిన అనంతరం భూములను డిజిటలైజేషన్ చేస్తామన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతున్నదని గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ విశ్వంలోనే అత్యంత అవినీతి పార్టీ అని.. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ అమర్, అక్బర్, ఆంటోనీలా మారుతారని, అవసరానికి తగినట్లుగా ఆయన రూపం మార్చుకుంటారని ఎద్దేవా చేశారు.