- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవైసీ.. పార్లమెంట్ ఓపెనింగ్ లైవ్ టెలికాస్ట్ వీడియో మరోసారి చూడు: అర్జున్ రామ్ మేఘవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ముస్లిం మత పెద్దలను ఆహ్వానించలేదని ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సెంట్రల్ విస్టా భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ముస్లిం మత పెద్దలను పిలిచామని, ఓవైసీకి వారు కనిపించలేదా? అని ఆయన ప్రశ్నించారు.
ఆయన ప్రారంభోత్సవానికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ మరోసారి సరిగ్గా చూడాలని కేంద్ర మంత్రి చురకలంటించారు. హైదరాబాద్ డస్పల్లా హోటల్‌లో ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనపై సోమవారం ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. 9 ఏండ్లలో మోడీ విజయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పుస్తకం, సాంగ్ రిలీజ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ గృహాలను నిర్మించారని, కానీ కొందరు అధికారులు, రాజకీయ నేతల వల్ల ఎందరికి అందాయనేది తెలియదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఇండ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేపట్టి నేరుగా లబ్ధిదారుకు అందించారని పేర్కొన్నారు. 2047 టార్గెట్‌గా మోడీ విజన్‌తో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని కృషిచేస్తున్నారన్నారు.
దేశవ్యాప్తంగా జన్ ఔషధి మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. పాండిచ్చేరిలోనూ ఏర్పాటు చేశామని, అది చూసి అక్కడి ప్రజలు ‘మెడిసిన్’ కోరుకోవడం లేదని, ‘మోడీ’సన్ కావాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ వెల్లడించారు. ఆపై ఆయన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.