Union Budget : కేంద్ర బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపులు ఇవే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-23 07:49:27.0  )
Union Budget : కేంద్ర బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపులు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ఫైనాన్స్ మినస్టర్ మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో మూడో సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అన్నదాతల కోసం ఇటీవలే మద్దతు ధరలు పెంచినట్లు గుర్తు చేశారు. మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల ఉచిత రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

శాఖల వారీగా కేటాయింపులు ఇవే..!

వ్యవసాయ, అనుసంధాన రంగాలు - రూ. లక్షా 52 వేల కోట్లు

విద్య, నైపుణ్యాభివృద్ధి - రూ.లక్షా 48 వేల కోట్లు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - రూ.2.2లక్షల కోట్లు

గ్రామీణాభివృద్ధి - రూ.2.66 లక్షల కోట్లు

మహిళాభివృద్ధి - రూ.3 లక్షల కోట్లు

మౌలిక సదుపాయాలు - రూ. 11.11 లక్షల కోట్లు

ఆయా రంగాలతో పాటు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లకు కేంద్ర బడ్జెట్‌లో ప్రియారిటీ దక్కింది. ఏపీ, బిహార్‌ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు - రూ.15 కోట్లు

బిహార్‌లో జాతీయ రహదారులకు రూ.20 వేల కోట్లు సహాయం


Click Here For Budget Updates!

Advertisement

Next Story

Most Viewed