Hyderabad:‘సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా’.. తీరా అక్కడికి వెళ్లిన మహిళకు ఊహించని షాక్!?

by Jakkula Mamatha |   ( Updated:2025-01-18 16:19:32.0  )
Hyderabad:‘సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా’.. తీరా అక్కడికి వెళ్లిన మహిళకు ఊహించని షాక్!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఫిల్మ్ ఇండస్ట్రీ(Film industry)కి అనేక మంది వస్తుంటారు. ఈ క్రమంలో సినిమా రంగంలో ఒక్క అవకాశం ఇస్తే చాలు.. అని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఈ తరుణంలో తమ టాలెంట్‌ను చూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సార్లు కష్టాలు కూడా ఎదుర్కొంటారు. ఇక వీరి ఆసక్తి, కోరిక, టాలెంట్‌ను అదునుగా చేసుకుని కొంత మంది వేరే విధంగా ఉపయోగించుకుంటారు. సినిమా(Movie)లో అవకాశం ఇప్పిస్తామని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడి(sexual assault)కి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఏపీ(Andhra Pradesh)కి చెందిన ఓ మహిళ సినిమాల్లో నటించాలనే కోటి ఆశలతో హైదరాబాద్‌కు వచ్చింది. సినిమాలో నటించాలని కోరికతో నగరానికి వచ్చిన ఆ మహిళకు ఊహించని షాక్ తగిలింది. సినిమాల్లో అవకాశమంటూ ఓ వ్యక్తి ఆమె పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మహిళ మణికొండలో ఉంటూ కృష్ణానగర్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో డైరెక్షన్ విభాగంలో ఒక వ్యక్తితో మహిళకు పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి(అసిస్టెంట్ డైరెక్టర్‌) సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో సినిమాల్లో నటించాలంటే ముందుగా ఆడిషన్స్‌ ఉండాలని మహిళకు చెప్పాడు. దీంతో మొదటి రోజు ఫొటో షూట్ చేసి మహిళకు నమ్మకం కలిగేలా చేశాడు. ఇక మరుసటి రోజు ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన పై బాధితురాలి ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ డైరెక్టర్(Assistant Director) పై BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read More..

బెడ్ షేర్ చేసుకోవడానికి తప్ప మగాడితో పనేముంది.. నాగార్జున హీరోయిన్ సంచలన కామెంట్స్

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed