Dayakar Chanagani : ఓయూలో 'నిరుద్యోగుల కృతజ్ఞతల సభ' : చనగాని దయాకర్

by Ramesh N |
Dayakar Chanagani : ఓయూలో నిరుద్యోగుల కృతజ్ఞతల సభ : చనగాని దయాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా పాలనకు మద్దతుగా డిసెంబర్ 21వ తేదీన 'నిరుద్యోగుల కృతజ్ఞతల సభ' ను ఏర్పాటు చేయబోతున్నట్లు (PCC) పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ (Dayakar Chanagani) ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. వేలాది మంది నిరుద్యోగ యువతతో ప్రభుత్వానికి జేజేలు పలికిస్తామని చనగాని చెప్పారు. వచ్చే నెల గ్రూప్ -2 పరీక్షలు అయిపోగానే నిరుద్యోగులతోని మరోసారి తెలంగాణ సమాజాన్ని కదిలించే రీతిలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కృతజ్ఞతల సభను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు, నిరుద్యోగులు అండగా ఉండాలని ఆయన సూచించారు. ఏడాదిలోపే 50 వేలకు పైగా ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని చనగాని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed