Konda Sureka: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం నిర్వీర్యం.. మంత్రి కొండా సురేఖ

by Ramesh Goud |
Konda Sureka: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం నిర్వీర్యం.. మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల బీఆర్ఎస్ పాలన(BRS Rule)లో విద్యారంగం(Education) నిర్వీర్యమైనదని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మండిపడ్డారు. ఆరంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజాప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తుందని అని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మనిషిని బహిర్గతంగానూ, అంతర్గతంగానూ వికసింపచేసేదే నిజమైన విద్య స్పష్టం చేశారు. సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యారంగ బలోపేతానికి ఆయన సేవలను మంత్రి కొనియాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People's Government) విద్యారంగంలో ప్రమాణాలను పెంచడం, ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

విద్యార్థులను ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దేందుకు నూతన క్రీడా పాలసీ త్వరలోనే రూపుదిద్దుకోనున్నదని వెల్లడించారు. చదువు బానిసత్వం నుంచి, ఆత్మన్యూనత నుంచి మనిషిని విముక్తున్ని చేసి నిజమైన స్వేచ్ఛను ప్రసాదిస్తుందన్నారు. విద్య జీవనోపాధిని కలిగించేది మాత్రమే కాదని, జీవిత పరమార్థాన్ని వెలికితీసేదని పేర్కొన్నారు. ఒక వ్యక్తిలో జ్ఞాన జ్యోతి నిత్యం జ్వలించినప్పుడే ఆ వ్యక్తి, తద్వారా సమాజం ఉన్నత శిఖరాలకు చేరుతుందని తెలిపారు. ఆర్జించిన జ్ఞానాన్ని ఇతరులకు బోధించడం ద్వారా సమాజ నిర్మాణంలో తమవంతు పాత్రను పోషించాలని యువతకు పిలుపునిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు తొలిరోజే యూనిఫాం, పుస్తకాల అందజేత, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల పెంపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, తెలంగాణ దర్శిని కార్యక్రమం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ విద్యారంగ ప్రగతి పట్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదనడానికి నిదర్శనం అన్నారు.

Advertisement

Next Story