- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DRDO మిస్సైల్స్ & స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉమ్మలనేని రాజాబాబు
దిశ , తెలంగాణ బ్యూరో : ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు డి ఆర్ డి ఓ మిస్సైల్స్, స్ట్రాటజిక్స్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా ఆర్ సి ఐ నియమించింది. ఇంతకాలం ఆ పదవిలో కొనసాగుతున్న డాక్టర్ బి హెచ్ వి ఎస్ నారాయణ మూర్తి 31 మే 2023న పదవీ విరమణ పొందారు . దీంతో రాజాబాబు నియామకం జూన్ ఒకటవ తేదీ నుండి అమలులోకి రానుంది .
1988లో వైమానిక దళంతో తన కెరీర్ ప్రారంభించిన రాజబాబు 1995లో డి ఆర్ డి ఓ లో చేరారు. 35 సంవత్సరాల ప్రొఫెషనల్ ఏరోస్పేస్ కెరీర్‌లో, విమానం, హెలికాప్టర్లు మరియు అనేక క్షిపణి వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషి చేసారు . ఆర్ సి ఐ లో ప్రోగ్రామ్ డైరెక్టర్, ఏ డి గా బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ల సామర్థ్యాల రూపకల్పన, అభివృద్ధి పరచడంలో తన సహకారం అందించాడు . రాజా బాబు నాయకత్వంలో, "మిషన్ శక్తి", ద్వారా భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష (ఏ -సాట్ ) విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది . ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ , ఐ ఐ టి ఖరగ్‌పూర్ నుండి మాస్టర్స్ మరియు జె ఎం టి యూ నుండి ఎం బి ఏ పట్టా పొందారు.
ఆర్ సి ఐ డైరెక్టర్‌గా వున్నా సమయంలో అనేక క్లిష్టమైన సాంకేతికత మరియు మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి, ఏ టి జి ఎం ల కోసం అధునాతన క్షిపణి ఏవియానిక్స్ అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు .అలాగే సాయుధ దళాల కోసం వ్యూహాత్మక, క్రూయిజ్ క్షిపణులు మరియు ఆయుధ వ్యవస్థల తోడ్పాటుకు రాజా బాబు కృషి చేసారు .
రాజా బాబు ప్రతిభకు మరియు రక్షణ అనువర్తనాలకు చేసిన కృషి గాను అనేక గుర్తింపులను తెచ్చిపెట్టింది. మిషన్ శక్తి ప్రదర్శనను విజయవంతం చేసినందుకు పాత్-బ్రేకింగ్ రీసెర్చ్ & అత్యుత్తమ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అవార్డును ఈయన అందుకున్నారు . రాజా బాబు నైపుణ్యానికి అగ్ని అవార్డు, డి ఆర్ డి ఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ మరియు విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు . ఇన్స్టిట్యూషన్ అఫ్ ఇంజనీర్స్ (ఐ ఈ ) మరియు అనేక ప్రొఫెషనల్ సొసైటీలలో జీవిత కాల సభ్యుడిగా వున్నారు .