- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC : ‘గ్రూప్ 1’ స్పోర్ట్స్ కోటా కింద ఇద్దరు ఎంపిక.. వివరాలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్ 1 మెయిన్స్‌కి స్పోర్ట్స్ కోట కింద ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. జీవో నం.74 ప్రకారం అధికారుల కమిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇద్దరినీ ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రూప్1కి స్పోర్ట్స్ కోటలో నేషనల్, మల్టీనేషనల్ క్రిడల్లో హాజరు అయినట్టు 36 మంది దరఖాస్తులు వచ్చాయన్నారు. అన్ని పరిశీలించిన తర్వాత ఇద్దరి సర్టిఫికెట్‌లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టు స్పోర్ట్స్ అధికారులు తేల్చిచేప్పారని వెల్లడించారు.
మెయిన్స్‌కి స్పోర్ట్స్ కోట కింద హాల్ టికెట్ నంబర్ 242401712, 242402685 వీరు ఎంపిక అయ్యారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు గ్రూప్-I మెయిన్స్ పరీక్ష ప్రారంభానికి ఒక వారం ముందు తమ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. కాగా, గ్రూప్ 1లో 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కంప్లీట్ కావడంతో అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదల అయింది.