- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బిగ్ షాక్.. ఎన్నికల వేళ మరో రెండు కేసులు నమోదు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా ఆయనపై మంగళ్ హాట్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. ఈ నోటీసులు జారీ చేసిన పోలీసులు వీటిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా ఈవెంట్‌కు వచ్చే వారందరి గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలని.. ఈ ఈవెంట్ కోసం ఓ వర్గం బౌన్సర్లు, డీజే ఆర్టిస్టులను రప్పిస్తే దాడులు చేస్తామని ఆ వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా కత్తులు, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
రాజాసింగ్ ప్రదర్శించిన తుపాకులు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందివని.. వాటిని ప్రదర్శించడం నిషేధమని, పోలీసుల వెపన్స్‌తో పాటు కత్తులను ప్రదర్శించడం చట్ట విరుద్ధమని వీటిపై స్థానిక నాయకుడు సమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులపై స్పందించిన రాజాసింగ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.