Minister Thummala : రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ

by Kalyani |   ( Updated:2024-10-03 10:53:02.0  )
Minister Thummala : రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రైతు, రైతు అనుబంధ రంగాలు బాగుపడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న ఆటంకాలు కల్పిస్తున్న ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలో రైతులకు సంబంధించిన 31 వేల కోట్ల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు.

ఇప్పటికే 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు మరో 13 వేల కోట్ల రుణాలను మాఫీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ తో పాటుగా రైతు భరోసా అందించి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అన్నారు. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. మోసగాళ్ల, దగా చేసిన వారి మాయమాటలు నమ్మొద్దని రైతులకు హితవు పలికారు. లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు జిల్లా రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది నాటికి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed