- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Missing : ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం...రంగంలోకి పోలీసులు
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కూకట్‌పల్లి(Kukatpally)పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థినిలు(Two girl students)లు అదృశ్యమైన(missing) ఘటన సంచలన రేపింది. వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక (14), లక్ష్మీ దుర్గ (13) లు అదృశ్యమయ్యారు. విద్యార్థినిలను సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కానరాకపోవడంతో వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు రోజులాగే స్కూల్లో ఉదయం 8:30కి వదిలి తిరిగి సాయంత్రంయ5:30 నిమిషాలకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లామని, పిల్లలు కానరాకపోవడంతో స్కూల్ టీచర్, ప్రిన్సిపాల్ ను సంప్రదించడంతో ఇప్పుడే వెళ్లారని తెలిపారు.
పిల్లల కోసం చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. తమ పిల్లల్ని క్షేమంగా తీసుకురావాలని తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అదృశ్యమైన విద్యార్థినిల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.