- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గల్లీల్లో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి దండాలు’.. కవిత vs రేవంత్ మధ్య ట్వీట్ వార్..!
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మరో సారి మోసం చేసేందుకు సిద్ధమయ్యాయి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, డీకే భేటీపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు. కాగా, కవిత ట్వీట్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. "గల్లీలో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు.. ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన 'నిక్కర్'.. లిక్కర్.. లాజిక్కు" అంటూ విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి రాజకీయ పరిస్థితులపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో "అప్పుడూ ఢిల్లీ.. ఇప్పుడూ ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు.. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం" అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.