- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లోకి తుమ్మల...? ఆయన బాటలోనే మరో నలుగురు కీలక నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఫోకస్ పెట్టింది. పార్టీలోకి తీసుకువచ్చేందుకు స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సీనియర్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఉన్న వ్యక్తితో పార్టీకి మేలు జరుగుతుందని భావించారు. దీంతోనే తుమ్మలను కాంగ్రెస్‌లోకి చేరాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా అనుచరులు, కార్యకర్తలు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ప్రాధాన్యత లేని పార్టీలో ఉండటం కంటే.. కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆ జిల్లా కార్యకర్తలు నొక్కి చెబుతున్నారు. ఇక తుమ్మల, రేవంత్‌లు గతంలో టీడీపీలో కలసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సీనియర్ నేతగా ఉన్న తుమ్మలకు రేవంత్ మంచి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉన్నదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కేడర్ చర్చించుకుంటున్నది.
సీనియర్ నేతగా గుర్తింపు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు రాజకీయాల్లో సుపరిచితుడు. తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలోకి చేరిన ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సొంత గడ్డ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తుమ్మల మొదటి సారి ఓటమి పాలైనా.. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఆ వెంటనే ఆయనకు ఎన్టీఆర్ కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయంలో వెనకడుగు వేయలేదు. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి, 2016 పాలేరు ఉప ఎన్నికలో తెరాస పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకంటే ముందు 2015లో మండలికి ఎన్నికయ్యారు. ఇక 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మంత్రిగా.. సుదీర్ఘ అనుభవం...
తుమ్మల నాగేశ్వరరావు 1985 నుంచి 1988 వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా, 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేశారు.
నెక్ట్స్ వీళ్లే....
తుమ్మల చేరిక సక్సెస్ చేసిన రేవంత్ రెడ్డి..మరో 20 మంది నేతలకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. మాజీ ఎమ్మెల్యే జలగం, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే మైనంపల్లిలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షుడు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందజేశారు. త్వరలోనే వీళ్ల చేరిక కూడా కన్ఫామ్ అవుతుందని పార్టీ వర్గాలు ఆశాభవం వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబరు సెకండ్ వీక్‌లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు కూడా చేరుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.