టీడీపీ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

by Javid Pasha |
టీడీపీ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగుదేశం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నల్లగొండ ఇంచార్జీ యల్.వి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా" అనే గోడ పోస్టర్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ చేసిన అభివృద్ధిని, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలపాలని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

Advertisement

Next Story