భాషాపండితులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి.. టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్

by Javid Pasha |   ( Updated:2023-02-18 15:58:28.0  )
భాషాపండితులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి.. టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భాషాపండితుల‌పై ప్రభుత్వం వేసిన సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతులు దక్కడం లేదనే ఆవేదనతో నిరసన తెలుపుతున్న పండితులను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి ప్రమోషన్ లేకపోయినా, పాఠశాలల్లో వివక్షకు గురవుతున్నారని తెలిపారు. అయిన విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో పోస్టులు అప్‌గ్రేడ్ చేసి ప్రరమోషన్లు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని తెలిపారు.

ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్లో కూడా తమ పదోన్నతుల అంశం లేకపోవడంతో ఆవేదనకు భాషా పండితులు గురవుతున్నారని వెల్లడించారు. తమ జాబ్ చార్ట్ లో లేని హైయర్ క్లాస్ బోధన చేయబోమని ఇచ్చిన పిలుపు నిరసన మాత్రమేనని, అయినా వారు అనధికారికంగా పాఠాలు బోధిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. నిరసన లేఖల ఆధారంగా రంగారెడ్డి, సంగారెడ్డి విద్యాధికారులు భాషా పండితులపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమన్నారు. డీఈఓల చర్యలను వ్యతిరేకిస్తూ.. పదోన్నతులపై ఉన్న కేసును ప్రభుత్వం చొరవతీసుకుని వెకేట్ చేయించి, ప్రస్తుత పదోన్నతుల షెడ్యూల్లోనే పండితులకు సైతం పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read..

పోలవరం ఆగిపోవడానికి కేసీఆరే కారణం: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story