- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శబరిమల భక్తులకు TSRTC గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో: అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమల భక్తులకు రాయితీపై స్పెషల్ బస్సులు అద్దెకు ఇస్తున్నట్టు తెలిపింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా అనుభవజ్ఞులైన డ్రైవర్లతో సురక్షిత ప్రయాణం కోసం రాయితీతో బస్సులను టీఎస్ ఆర్టీసీ ఈ ఏర్పాటు చేసిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి ముందస్తు డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను అందుబాటులో ఉంచిందన్నారు.
అదనపు సీట్ల కోసం ఇద్దరు గురు స్వాములు, 02 వంట మనుషులు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ తో పాటు శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులలో ఆడియో, వీడియోతో పాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించ వలసిన పుణ్య క్షేత్రాల వరకు నడుపుతామని ఈ సేవల కోసం సమీపంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ల లేదా www.tsrtconline.in సందర్శించాలన్నారు. సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు TSRTC కాల్ సెంటర్ 040 23450033, 69440000 సంప్రదించాలన్నారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.