- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ కస్టడీకి టీఎస్ పీఎస్సీ ప్రధాన నిందితులు!
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలకు నాంపల్లి కోర్టు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 17,18 న ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో చంచల్ గూడ జైలులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా ఈ కేసులో సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని అందువల్ల ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ కస్టడీకి ఇవ్వొద్దని గురువారం సిట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు విన్నవించారు.
అయితే ఈ కేసులో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ ఆ దిశగా విచారణ చేపట్టింది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మిని ప్రశ్నించగా ఎల్లుండి నుంచి ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించబోతోంది. ఈడీ దూకుడుతో ఈ కేసు విచారణ ఉత్కంఠ రేపుతోంది.