- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివాదాలకు కేరాఫ్‌గా TSPSC.. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత నిల్!
రాష్ట్రంలో మొదటి నుంచీ ఉద్యోగాల భర్తీలో పాదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ మొదలు తాజాగా ఈనెల 5న టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఈ ఎగ్జామ్ వరకు ఏదో వివాదం చోటుచేసుకుంటూనే ఉన్నది. రహస్యంగా ఉండాల్సిన పరీక్షా పత్రాలు ముందే బయటకు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. ప్రభుత్వం నోరు మెదపకపోవడం గమనార్హం. గతేడాది జూలైలో విద్యుత్ సంస్థలో లైన్‌మెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో ఆ ఎగ్జామ్‌ను రద్దు చేశారు. పోలీసు ఉద్యోగాల భర్తీ సైతం రచ్చకెక్కింది. ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడం, ఈవెంట్స్‌లో మార్పుల కారణంగా అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలా ప్రతి రిక్రూట్‌మెంట్‌లో వివాదాలు తలెత్తుతుండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహస్యంగా ఉండాల్సిన పరీక్షా పత్రాలు ముందుగానే లీక్ అవుతున్నాయి. ఇలాంటి సందర్భాలు ఒకటి, రెండు సార్లు కాదు.. వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమో, లేదంటే అధికారుల అలసత్వమో తెలియదు కానీ.. మొదటి తప్పు జరిగినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేవి. కానీ వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్న ప్రభుత్వంలో కదలికలేకపోవడం ఉద్యోగ అభ్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
సింగరేణి నుంచి మొదలు..
2015లో సింగరేణిలో 450 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. అందులో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో పెద్ద ఎత్తున గందరగోళం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పైరవీలు ఉన్న వారికే పోస్టులు దక్కాయని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ లోకల్ లీడర్లు, సింగరేణి పెద్ద ఆఫీసర్లు కుమ్మక్కై ఒక్కో పోస్టును రూ.10 లక్షలకు అమ్మకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురికి ఉద్యోగాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. గతేడాది సెప్టెంబరు 4న జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష సైతం వివాదాస్పదమైంది. పరీక్ష జరిగిన రోజే క్వశ్చన్ పేపర్‌ను లీక్ చేసి గోవాలో ఎగ్జామ్ రాయించినట్టు వార్తలు వచ్చాయి. ప్రైమరీ ‘కీ’లో తప్పులు దొర్లాయని దాదాపు 3వేల అభ్యంతరాలు వచ్చినా సింగరేణి సంస్థ పట్టించుకోలేదు. కానీ పైనల్ రిజల్ట్‌లో మాత్రం అందరికీ మూడు మార్కులు కలిపింది. పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్ తప్పుల తడకగా పెట్టారు. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉండిపోయింది.
విద్యుత్ శాఖలో..
గతేడాది జూలైలో సదరన్ విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్‌మెన్ల ఎంపిక కోసం పరీక్షలు నిర్వహించారు. పరీక్షా సమయంలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో ఎగ్జామ్ సెంటర్‌లోకి వచ్చాడు. దీన్ని గమనించిన సెంటర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. ఎగ్జామ్‌కు వెళ్లే ముందు జవాబులు చెబుతానని డబ్బులు తీసుకున్నారని, అందుకే సెల్‌ఫోన్ తీసుకొచ్చాని సదరు అభ్యర్థి వివరించాడు. దీనిపై విచారణ చేస్తున్న సమయంలో మరో అభ్యర్థి అంబర్‌పేట పోలీసులను ఆశ్రయించాడు. పరీక్ష సెంటర్ లోపలకి వెళ్లే ముందు ఫోన్ చేసి జవాబులు చెపుతామని డబ్బులు తీసుకుని తనను మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎంక్వైరీ చేసిన పోలీసులు ఎగ్జామ్స్‌కు ముందే క్వశ్చన్ పేపర్ లీకైందని గుర్తించారు. విద్యుత్ సంస్థలో పనిచేసే ఐదుగురు ఉద్యోగులు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లే ముందు అభ్యర్థులకు సెల్ ఫోన్ ద్వారా జవాబు చెపుతామని హామీ ఇచ్చారని, అందుకు ఒక్కోక్కరి వద్దు రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని తేలింది. ఇలా 181 మంది అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేశారని, ఒకేసారి అందరికి ఫోన్‌లో జవాబులు చెప్పేందుకు సమయం సరిపోకపోవడంతో ఓ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు.
వివాదాలకు కేరాఫ్‌గా టీఎస్‌పీఎస్సీ
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి పరీక్షలో టీఎస్‌పీఎస్సీ వివాదాలు ఎదుర్కొంటున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలు ముందు గ్రూప్–2 పరీక్షల్లో పెద్ద వివాదం నడించింది. నిబంధనలకు విరుద్ధంగా వైట్‌నర్ ఉపయోగించిన అభ్యర్థుల పేపర్లను కమిషన్ వాల్యూయేషన్ చేసింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాల ప్రకటనలో జాప్యం ఏర్పడింది. ఇక సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రతీ పరీక్షలో న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటిని కోర్టులో టీఎస్పీఎస్సీ సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయిందనే ఆరోపణలు వచ్చాయి. చివరికి ప్రభుత్వ విభాగమైన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో వివాదం నడించింది. సర్వీస్ కమిషన్‌కు కావాల్సిన విధంగా సాప్ట్‌వేర్ అందించట్లేదని అప్పటి సర్వీస్ కమిషన్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అప్పగించలా? వద్దా? అని అప్పట్లో ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది.
తాజాగా పేపర్ లీక్
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరుగుతున్నదని ఆ సంస్థ అధికారులు పదే పదే చెబుతుంటారు. కానీ తాజాగా మార్చి 5న నిర్వహించిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఫిర్యాదు రావడంతో ఎంక్వయిరీ చేయగా సెక్రటరీ పెషీ నుంచే పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు. అనుమానంతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ పరీక్షలు, వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం టీఎస్పీఎస్సీ అధికారులు వాయిదా వేశారు. ఏఈ పరీక్ష రద్దుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అలాగే గ్రూప్–1 పరీక్ష పేపర్ కూడా లీకైందనే అనుమానులు ఉన్నాయి. పేపర్ లీక్ లో కీలక వ్యక్తిగా ఉన్న ప్రవీణ్ కూడా గ్రూప్ 1 పరీక్ష రాశాడు. అందులో అతడికి 103 మార్కులు వచ్చాయి. దీంతో ముందుగానే అతనికి ప్రశ్నలు తెలుసని, పరీక్షను రద్దు చేయాలని అభ్యర్థులు అందోళన చేస్తున్నారు.
పోలీస్ రిక్రూట్‌మెంట్‌లోనూ..
గతంలో పోలీసు ఉద్యోగం కోసం ఐదు ఈవెంట్స్ ఉండగా ప్రస్తుతం వాటిని మూడుకు కుదించారు. చాలా కాలం తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీ చేస్తుండటంతో వయస్సు పరిమితిని పెంచాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. చివరికి పరిమితిని 3 ఏండ్లు సడలించారు. ప్రిలిమ్స్ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. దీనిపై అభ్యర్థులు ఆందోళనలు చేయగా చివరికి పాటించారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో దాదాపు 20 కి పైగా తప్పుడు ప్రశ్నలు ఇచ్చారని (రెండు పరీక్షల్లో కలిపి) అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థులకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో చివరకు బోర్టు మార్కులు కలిపింది. ఈవెంట్స్ సమయంలోనూ వివాదాలు తలెత్తాయి. గతంలో 3.4 మీటర్లు ఉన్న లాంగ్ జంప్‌ను ఏకంగా 4 మీటర్లకు పెంచారు. ఇక ప్రెగ్నెంట్, డెలివరీ అయిన మహిళా అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మెయిన్ ఎగ్జామ్ తర్వాత వారికి ఈవెంట్స్ నిర్వహించాలని కోర్టు బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.