- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC: పాలమూరు జిల్లాలో సిట్ అధికారుల విచారణ.. అదుపులో ఓ కాంట్రాక్టు ఉద్యోగి..
దిశ బ్యూరో, మహబూబ్ నగర్/జడ్చర్ల: టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వాహణకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారాల నిందితులలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఉండడంతో.. గతంలో జరిగిన పరీక్షలలో ఏయే పరీక్షలలో ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయి అన్న విషయాలపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే పోలీసు యంత్రాంగంతో పాటు.. సిట్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణను నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మండలంలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా పనిచేస్తూ ఈ పరీక్షలలో 100కు పైగా మార్కులు సాధించిన నేపథ్యంలో అతడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తిని విచారణ నిమిత్తం అతను పని చేస్తున్న మండలానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థుల వివరాలను సేకరించి, వారు పేపర్ లీకేజ్ వల్ల ఆ మార్కులు సాధించారా..? లేక బాగా చదివి సాధించారా..? అన్న విషయాలను తేల్చడానికి సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.