- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాళిబొట్టు తీయాలనే ప్రచారం అవాస్తవం.. TSPSC చైర్మన్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలనే ఎలాంటి నిబంధనలు లేవని శుక్రవారం ఆయన వెల్లడించారు. హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నారని పలువురు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మీడియాతో ఆయన తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల అభ్యర్థులు గందరగోళ పరిస్థతులు ఎదుర్కొనే అవకాశముందని ఆయన పేర్కరొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని జనార్దన్ రెడ్డి సూచించారు.
ఇదిలా ఉండగా కొన్నిచోట్ల తాలుకా, మండల స్థాయిలోనూ పరీక్ష కేంద్రాలు ఉండటంతో బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షాసమావేశాలు నిర్వహించామన్నారు. సుమారు 40 వేలమంది ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో యువతి, యువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశామని, అందుకు సరిపడా మహిళా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు రెండుగంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి జనార్దన్ రెడ్డి సూచనలు చేశారు.