బ్రేకింగ్: సీఎం కేసీఆర్‌తో TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి కీలక భేటీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-18 06:20:08.0  )
బ్రేకింగ్: సీఎం కేసీఆర్‌తో TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లికేజీ వ్యవహారం దూమరం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్‌తో టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ సహా ఏఈ, డీఏవో తదితర పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ప్రభుత్వం దృష్టిసారించింది. అభ్యర్థులకు భరోసా ఇచ్చేలా పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా పలు కీలక అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ భేటీలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed