- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్సీ.. అనర్హులకు ప్రియారిటీ?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునరావాస కేంద్రంగా మారింది. ఫస్ట్ టర్మ్‌లో, ప్రస్తుత కమిషన్ బాడీలో ఆ ఈక్వేషన్స్ ఆధారంగానే నియామకాలు జరిగాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి, పార్టీలో పని చేసిన వారికి, లాయర్‌గా ఉన్న వారికి, కుల సమీకరణలు వర్కవుట్ అయ్యేలా నియామకాలు జరిగాయంటూ అప్పట్లోనే బహిరంగంగా విమర్శలొచ్చాయి. నిపుణులు, నిష్ణాతులు, సమర్థులు, నిబద్ధతగా పనిచేసే వారు ఉండాల్సిన కమిషన్‌లో పైరవీలతో పోస్టులు దక్కాయని, రాజకీయంగా అవకాశం కల్పించలేని వారికి ఈ పదవులు ఇచ్చి సంతృప్తి పర్చారన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన ఈ రాజ్యాంగబద్ధ సంస్థలో బాధ్యతగా పనిచేయాలనేది మౌలిక సూత్రం. అయినా పేపర్ లీకేజీ తర్వాత ఎవ్వరూ బాధ్యత తీసుకోకపోవడంపై విపక్షాల నుంచే కాక మేధావులు, విద్యార్థుల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. కమిషన్ రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పనా కేంద్రంగా మారిందనే ముద్ర పడింది.
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్పీఎస్సీలో అవకాశం దక్కించుకున్న వారందరికీ ఏదో ఒక బలమైన అండ ఉన్నదని, అందుకే వారు లక్షలాది రూపాయల జీతం, ప్రొటోకాల్, ప్రభుత్వం నుంచి సకల సౌకర్యాలు పొందే పదవులు పొందారన్న చర్చలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ సంఘాల పెద్దల పైరవీలు, వారి దయాదాక్షిణ్యాలతో ఈ పదవులు అనుభవిస్తున్నారని ఇటీవల కమిషన్ కార్యాలయం ముందు ధర్నాల సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు బహిరంగంగానే కామెంట్ చేశారు.
తొలి టర్ములో కోర్టు కేసులతో కాలయాపన జరిగిందనే విమర్శలు వచ్చినా పరీక్షల నిర్వహణ, అర్హులైన అభ్యర్థుల ఎంపిక తదితర ప్రక్రియల్లో అవకతవకలు లేకుండా సజావుగా సాగిందనే అభిప్రాయం విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. 13 రాష్ట్రాలకు చెందిన కమిషన్ సభ్యులు వచ్చి ప్రశంసించారని, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైతం కితాబిచ్చిందని ఇటీవలే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బోర్డు విషయంలో అలాంటి మంచి అభిప్రాయం వ్యక్తం కావడం లేదు.
పేపర్ లీక్ వ్యవహారం తర్వాత విద్యార్థులు, నిరుద్యోగుల్లో నెలకొన్న ఆందోళనతో చైర్మన్ సహా ఒక్కో సభ్యులు ఎలా నియమితులయ్యారో ఓపెన్‌గానే చిట్టా విప్పి చెప్పేస్తున్నారు. చైర్మన్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి గతంలో హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉండి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే ప్రభుత్వం ఆయనను సంప్రదించకుండానే బదిలీ చేసిందని, చాలా కాలం వెయిటింగ్‌లో పెట్టిందని, ఇప్పుడు ఏకంగా చైర్మన్‌ను చేసిందని, చివరకు పేపర్ లీక్ విషయంలో ఆయన ఎలాంటి బాధ్యతా తీసుకోలేదన్న విమర్శలు మిన్నంటాయి.
కమిషన్ తీసుకున్న నిర్ణయాలను సెక్రటరీ హోదాలో అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారి సైతం పేపర్ లీక్ విషయంలో మౌనంగా ఉండిపోయారని, నైతికంగా బాధ్యత తీసుకోలేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సిన కార్యదర్శి ఆ బాధ్యతల్లో విఫలమయ్యారని గతంలో కమిషన్ సభ్యులుగా పని చేసిన వారు సైతం విమర్శించారు.
నియామకాలపై విమర్శలు
పారిశ్రామిక వేత్తలకు బంధువులుగా ఉన్న వారిని, గతంలో ఉద్యోగ సంఘాల్లో యాక్టివ్‌గా పని చేసిన వారిని, తెలంగాణ జాగృతికి అనుబంధంగా ఉన్న వారిని, మంత్రులకు సన్నిహితంగా ఉన్న వారిని, కొద్ది మంది అధికారుల సిఫారసు ఉన్న వారిని కమిషన్‌లో నియమించడంపై గతంలో విమర్శలు వచ్చాయి. పేపర్ లీక్ తర్వాత అది ప్రస్ఫుటంగా తెరపైకి వచ్చింది. రాజకీయంగా ఎక్కడా అవకాశం ఇవ్వలేక కమిషన్‌లో పోస్టు ఇచ్చి సంతృప్తి పర్చేలా సీఎం నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకోడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అవకాశాలు ఇచ్చి దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్న అపవాదును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఏకరువు
పేపర్ లీక్ వ్యవహారంలో ఆగ్రహంగా ఉన్న నిరుద్యోగులు కమిషన్‌లోని సభ్యులందరి నేపథ్యాన్ని, వారు ఇందులో పునరావాసం పొందడానికి దారితీసిన పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతున్నారు. ఏ నైపుణ్యం లేకపోయినా సభ్యులుగా అవకాశాలు ఎందుకివ్వాల్సి వచ్చిందో పాత నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కాలంలో వారిపై ఆరోపణలు రావడం, ఆ ఫిర్యాదులకు అనుగుణంగా విజిలెన్స్ ఎంక్వయిరీ జరిగినా ఉద్యో్గ విరమణ తర్వాత వారికి కమిషన్‌లో చోటు కల్పించడాన్ని నిరుద్యోగులు తప్పుపడుతున్నారు.
సర్వీసులో ఉన్నకాలంలో ఉద్యోగ సంఘాల నేతలుగా చెలామణి అయ్యి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించినందుకు కృతజ్ఞతగా ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఈ పదవులను కట్ట బెట్టారని, అర్హతలకు ప్రభుత్వం తిలోదకాలిచ్చిందన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు రెండు వారాలుగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్రం అట్టుడికిపోతున్నా, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా, స్వయంగా గవర్నర్ డెడ్‌లైన్ పెట్టి స్టేటస్ రిపోర్టు కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల విలువైన సమయం, ఆర్థిక వనరులకు నష్టం జరిగినా ఇప్పటికీ కమిషన్ తరఫున ఎవరూ నైతిక బాధ్యత వహించలేదని నిరుద్యోగులు మండి పడుతున్నారు.
ఇవి కూడా చదవండి: కవిత పిటిషన్‌పై గందరగోళం.. ఈడీ నెక్ట్స్ ఎంక్వయిరీ నోటీసులపై డైలమా!